News

ఎంఎస్ నారాయణ ఇకలేరు


ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు.  ఆనారోగ్యంతో మాదాపూర్ కిమ్స్లో చికిత్స పొందుతున్న  ఆయన శుక్రవారం మృతి చెందారు. ఈ విషయాన్ని  ఎమ్మెస్ నారాయణ కుమారుడు విక్రమ్ ధ్రువీకరించారు. కొద్ది రోజులుగా ఎమ్మెస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు సినీ అభిమానులకు ఎమ్మెస్ నారాయణగా సుపరిచితుడైన మైలవరపు సూర్యనారాయణ ఏప్రిల్ 16, 1951లో పశ్చిమగోదావరి జిల్లాలోని నిడమర్రులో జన్మించారు. ఆయనకు భార్య కళాప్రపూర్ణ, కుమారుడు విక్రమ్,  కుమార్తె శశికిరణ్  ఉన్నారు. సుమారు 700 సినిమాల్లో నటించిన ఎమ్మెస్ ప్రతిష్టాత్మక నంది అవార్డును అయిదుసార్లు అందుకున్నారు.